తెలంగాణ

telangana

ETV Bharat / videos

హోలీ రోజు ఈ ఊర్లో పిడిగుద్దుల పండుగే స్పెషల్ - ఎక్కడో తెలుసా? - fistfights on Holi festival - FISTFIGHTS ON HOLI FESTIVAL

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 10:06 PM IST

FistFights on Holi festival in Nizamabad District : హోలీ పండుగ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది రంగులు. కానీ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడటం ఆనవాయితీ. ఉదయం రంగులు చల్లుకున్న తర్వాత గ్రామంలో సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించి, అనంతరం గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.  

Husna Village people Celebrating fistfights on Holi festival : ఈ ఆనవాయితీ పూర్వకాలం నుంచి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. ఆటలో ఎవరికైనా దెబ్బలు తగిలితే, కామదహనంలోని బూడిదను దెబ్బలపై పుసుకుంటామని చెప్పారు. పోలీసులు వద్దని వారిస్తున్నా, గ్రామానికి అరిష్టం వాటిల్లకుండా ఈ క్రీడను ఆడతామని గ్రామస్థులు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆటకు అనుమతి ఇవ్వకపోయినా, స్థానిక పోలీసుల పర్మిషన్​తో తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. పిడిగుద్దులాటలో కక్ష సాధింపులతో కాకుండా, స్నేహ భావంతో గ్రామస్థులందరూ పాల్గొంటారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details