పెట్రోల్ బంకు వద్ద కారులో మంటలు - స్థానికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం - Fire Catches Car In Hyderabad
Published : Mar 19, 2024, 7:27 PM IST
Fire Catches Car In Hyderabad : హైదరాబాద్ నగర శివారు చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి నుంచి లింగపల్లికి కొందరు ప్రయాణికులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుల్‌మోహర్ పార్కు వద్ద గల హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు సమీపంలోకి కారు రాగానే అందులోంచి మంటలు చేలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు, పెట్రోల్ బంకు సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Electric Scooter Fire Accident In Siddipet : మరోవైపు సిద్దిపేట పట్టణంలోని మోడల్ బస్టాండ్ ఎదురుగా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. వాహనదారుడు అప్రమత్తమవ్వడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై మంటలు ఆర్పివేయడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ-బైక్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.