తెలంగాణ

telangana

ETV Bharat / videos

నల్లమల అడవుల్లో చెలరేగిన మంటలు - 30 హెక్టార్ల మేర అడవి దగ్ధం - Fire Breaks Out at Nallamala Forest - FIRE BREAKS OUT AT NALLAMALA FOREST

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 10:33 AM IST

Fire Breaks Out at Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మన్ననూర్ వెస్ట్​ బీట్​ తాళ్లచెల్క సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దగ్ధమైంది. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగిన సమాచారం అందుకున్న నాగర్​ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఫైర్ వాచర్లు, బేస్​ క్యాంప్ బృందం చాలా సమయం శ్రమించి మంటలను అదుపు చేశారు.

ఇలాంటి మంటల కారణంగా అడవిలో జీవించే జంతువులు, కీటకాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఎలాంటి మానవ చర్యలు జరపొద్దని ప్రజలకు సూచించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు అడవిలో మంటలు పెట్టవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని నాగర్​ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి కోరారు. అడవుల్లో మంటలకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details