ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కడప జిల్లాలో దారుణం - మద్యం మత్తులో సొంత కుమారుడిని గొంతు నులిమి చంపిన తండ్రి - Father Kills Son - FATHER KILLS SON

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 9:28 PM IST

Father Killed His Son in YSR District : కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత కుమారుడిని తాగిన మత్తులో ఓ తండ్రి గొంతు నులిమి చంపటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జిల్లాలోని వేంపల్లి మండలంలోని రాజీవ్‌ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, జీవనోపాది కోసం ప్రొద్దుటూరు నుంచి వేంపల్లిలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి వచ్చిన సురేష్‌ తన భార్య ఇక్కడే స్థిరపడ్డారు. అయితే చాలా రోజులుగా సురేశ్ మద్యానికి బానిసగా మారాడు. తరచూ మద్యం తాగి వచ్చి పుట్టుకతో మూగ అయిన భార్యను వేధిస్తున్నాడు. ఈ దంపతులకు ఏడాది బాలుడు ఉన్నారు. అయితే ప్రతి రోజూ మాదిరిగానే సురేశ్ మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. వెంటనే మంచంపై నిద్రిస్తున్న కుమారుడిని గొంతనులిమి చంపేశాడు. 

అనంతరం ఆ నిందను భార్యపై వేసే ప్రయత్నం చేశారు. 'తాను బాలుడిని చంపుతున్న సమయంలో తన భార్య ఉంట్లోనే ఉందని సురేశ్ తెలిపారు. చివరకు తన కుమారుడిని తానే గొంతు నులిమి చంపానని' సురేశ్ వెల్లడించారు. అనంతరం తాగిన మత్తులో ఏంచేశానో తెలియదంటూ, పొరపాటు జరిగిందని చెప్పారు. దీంతో స్థానికులు సురేశ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. అభం శుభం తెలియని పసి బాలుడి ప్రాణం తీసిన నిందితుడు సురేశ్‌ను అసలు వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details