తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎకరాకు 100 బస్తాలు వస్తాయని చెప్పారు - 30 బస్తాలూ పండలేదు - కొడంగల్‌లో రైతుల రాస్తారోకో - Farmers Protest for Crop Loss - FARMERS PROTEST FOR CROP LOSS

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 4:32 PM IST

Farmers Protest for Crop Loss due to Fake Seeds : నకిలీ విత్తనాలు అంటగట్టి తమను నట్టేట ముంచారని ఆరోపిస్తూ వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో రైతులు రోడ్డెక్కారు. ఎకరానికి వంద బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికారని, తీరా పంట చేతికొచ్చే సమయానికి కేవలం 30 బస్తాలకు మించి పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొడంగల్ అంబేడ్కర్‌ కూడలిలో వందమందికి పైగా అన్నదాతలు రాస్తారోకోకు దిగారు.  

ఓం ట్రేడింగ్ దుకాణదారు పంటలు వేసే సమయానికి విజయదుర్గా కంపెనీకి చెందిన వరి విత్తనాలు బలవంతంగా అంటగట్టారని రైతులు ఆరోపించారు. కొద్ది మొత్తంలో వచ్చిన వడ్లను నాణ్యత లేదనే సాకుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనకపోగా ప్రైవేటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు. ప్రస్తుతం ఓం ట్రేడింగ్​ దుకాణదారుని అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎకరానికి పదివేల పరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కర్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details