తెలంగాణ

telangana

ETV Bharat / videos

నార్కట్​పల్లిలో పులి సంచారం - అబద్ధమని తేల్చిన అటవీ శాఖ - Nalgonda Fake Tiger News

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 5:37 PM IST

Fake Tiger News In Nalgonda : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో పులి కనిపించిందనే ప్రచారం వాస్తవం కాదని అటవీ శాఖ ప్రకటించింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిపారు. ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. చిరుత పులికి సంబంధించిన సమాచారం కూడా గుర్తించలేదని తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఎంసీ పర్గెయిన్ జిల్లా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచరించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.  

Fake News About Tiger In Narkatpally : కొందరు పక్క రాష్ట్రాలకు చెందిన పులి సంచారం వీడియోలను ఈ ప్రాంతానికి చెందినవిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆ వార్తలను నమ్మొద్దని అటవీ శాఖ అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా పులితో పాటు, వన్య ప్రాణుల సంచారం తెలిసినట్లైతే వెంటనే స్థానిక అధికారులకు సరైన సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.  

ABOUT THE AUTHOR

...view details