తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత - బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల పరస్పర దాడులు - TENSION AT TELANGANA BHAVAN - TENSION AT TELANGANA BHAVAN
Published : Sep 30, 2024, 4:54 PM IST
Tension At Telangana Bhavan: కాంగ్రెస్ నేతలు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొంత మంది కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్లారు. బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను అక్కడున్న గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరస్పరం తోపులాట జరిగి ఉద్రిక్తత తలెత్తింది. సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకొని కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు.
వరంగల్ ఎపిసోడ్: వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిల మధ్య వాడివేడి సవాళ్ల పర్వం నడుస్తోంది. నయిం నగర్ వంతెన నిర్మాణ విషయంలో రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా వినయ్ భాస్కర్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు దిగలేదని మండిపడ్డారు.