తెలంగాణ

telangana

ETV Bharat / videos

బీఆర్ఎస్​ను వీడే ప్రసక్తే లేదు : మర్రి జనార్దన్ రెడ్డి - Marri Janardhan about Party Change

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 7:11 PM IST

EX MLA Marri Janardhan Reddy about BRS : తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇదంతా తప్పుడు ప్రచారమని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీఆర్ఎస్​కు రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరుతున్నట్లు దుష్ప్రచారం జరుగుతుందని, గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Marri Janardhan Reddy About Party Change :  భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు, కేసీఆర్​కు చెప్పే నిర్ణయం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్, బీజేపీ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించింది వాస్తవమేనన్న ఆయన, మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తామన్నారని తెలిపారు. కానీ తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీ మారే అవసరం అంతకన్నా లేదని తిరస్కరించానని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details