తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేసీఆర్​ సీఎంగా లేకపోవడాన్ని పార్టీ నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : నిరంజన్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 8:20 PM IST

EX Minister Niranjan Reddy on BRS Meeting : బీఆర్​ఎస్​ పార్టీ సమీక్ష సమావేశాలు అద్భుతంగా జరిగాయన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 70 నుంచి 100 మంది వరకు సమావేశాలకు హాజరయ్యారని వెల్లడించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రెండు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పొందేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలుసని అన్నారు. హామీలను ఎగ్గొట్టేలా కాంగ్రెస్ ఎలా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందోనని దాన్ని ఎండగట్టాలన్న నిరంజన్‌రెడ్డి, గులాబీ జెండా పుట్టిందే పేదల కోసమన్నారు. 

BRS Leader Niranjan Reddy about KCR : కాంగ్రెస్​ ఇచ్చిన 420 హామీల అమలుకు ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ఒత్తిడి చేయాలని పార్టీ నాయకులను ఆదేశించామని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. తెలంగాణలో అడుగడుగునా నీళ్లు పారించిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన ఉద్ఘాటించారు. కేసీఆర్ రావాల్సిందే అన్న ప్రబలమైన భావన ప్రజల నుంచే వస్తుందన్న బలమైన విశ్వాసంతో ఉన్నామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాల గురించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details