ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టూరిజానికి పెద్దపీట వేస్తాం- ఈటీవీ భారత్ ముఖాముఖిలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీ - TDP leader Kesineni Chinni - TDP LEADER KESINENI CHINNI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 3:23 PM IST

TDP leader Kesineni Chinni: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మూడు ప్రధాన పార్టీల నుంచీ పోటీ చేస్తుండటంతో, విజయవాడ పార్లమెంట్ స్థానం ప్రత్యేకత చాటుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ ఎన్నికల బరిలో నిలవగా ఆయన సొంత సోదరుడు కేశినేని నాని ( Keshineni Nani ) వైసీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే కుటుంబానికి చెందిన వల్లూరు భార్గవ్ సైతం ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్నారు. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి తనయులు కేశినేని నాని, కేశినేని చిన్నీలు కాగా, వెంకయ్య కుమార్తె వల్లూరి కస్తూరి మనవడు భార్గవ్ కావటం గమనార్హం. కుటంబం ఒకటైనా పార్టీలు వేరుగా తమ సత్తా చాటేందుకు వీరు సిద్ధమయ్యారు. తొలిసారి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్నీ ( Kesineni Chinni ) తో ఈటీవీ భారత్ నిర్వహించిన ముఖాముఖిలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.    

ABOUT THE AUTHOR

...view details