ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుడివాడకు పూర్వ వైభవం- పది సంవత్సరాల తర్వాత పుట్టింటికి చేరిన సైకిల్ - Gudivada TDP MLA Venigandla Ramu Interview - GUDIVADA TDP MLA VENIGANDLA RAMU INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 12:32 PM IST

Gudivada TDP MLA Venigandla Ramu Interview : కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాలు ఆది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తరమే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించటంతో ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లుగా భావిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్​కు కంచుకోటగా ఉన్న ఈ నియెజకవర్గంలో గత దశాబ్ధకాలం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

టీడీపీ ఆవిర్భావం నుంచి పది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 1989, 2014, 2019 మినహా ఏడు సార్లు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించారు. తాజాగా ఇక్కడ మళ్లీ పసుపు దళానికి పూర్వ వైభవం రావడంతో తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము గత రికార్డులు తిరగరాస్తూ ఘన విజయం సొంతం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నానిని ప్రజలు అసహ్యించుకుని ప్రతీకారంతో ఇచ్చిన తీర్పు ఇది అంటున్న వెనిగండ్ల రాముతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details