LIVE : లోక్‌సభలో 'జమిలి బిల్లు'పై ఓటింగ్ - ప్రత్యక్షప్రసారం - LOK SABHA LIVE
Published : Dec 17, 2024, 1:40 PM IST
|Updated : Dec 17, 2024, 1:54 PM IST
Jamili Election Bill Voting Live : లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరుగుతుంది. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 ఓట్లు వచ్చాయి. అదే విధంగా జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. ఇంకా లోక్‌సభలో జమిలి బిల్లును తదుపరి చర్యలు తీసుకోవడంపై ఓటింగ్ కొనసాగుతోంది. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరుగుతోంది. లోక్‌సభలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఓటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ విధానంలో కొందరు ఎంపీలు ఓటును వినియోగించుకున్నారు. లోక్‌సభలో హైబ్రిడ్ విధానంలో ఓటింగ్. ఎలక్ట్రానిక్ పద్థతిలో ఓటేసిన 369 మంది ఎంపీలు ఓటేశారు. విపక్షాలు అన్నీ లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికల బిల్లుకు ఎన్డీఏ కూటమి పక్షాలు మద్దతు పలికాయి. బిల్లును జేపీసీకి పంపుతూ తీర్మానం పెడతామన్న అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. జమిలి బిల్లును జేపీసీకి పంపడానికి అభ్యంతరం లేదని హోంమంత్రి స్పష్టం.
Last Updated : Dec 17, 2024, 1:54 PM IST