ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఓటర్లకు ప్రలోభాలు'- ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఎన్నికల బృందాల తనిఖీ - Election Observation Committee Ride

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 12:14 PM IST

Election Observation Committee Ride In Visakha MP MVV Satyanarayana Green Garden apartments : విశాఖ నగరం ఎండాడ ప్రాంతంలోని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన  గ్రీన్ గార్డెన్ అపార్ట్మెంట్లో ఎన్నికల పరిశీలన బృందాలు తనిఖీలు నిర్వహించాయి. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో క్రికెట్ కిట్లు, డ్రెస్ మెటీరియల్స్ నగదు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి ఫిర్యాదు కావడంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలు (Inspections) నిర్వహించామన్నారు.

మొత్తం 65  ప్లాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తనిఖీ బృందాలకు అక్కడ ఎలాంటి వస్తువులు దొరకలేదని పేర్కొన్నారు. ఇదే రిపోర్టునుపై అధికారులకు పంపనట్లు ఆర్డీవో వెల్లడించారు. ఎన్నికల్లో (Elections) ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో జరిగినా ఎన్నికల పరిశీలన బృందాల (Election Observation Committee) దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details