ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ నేతలకు ఒక'లా'- వైఎస్సార్సీపీ నేతలకు మరో'లా' - election code violation - ELECTION CODE VIOLATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:25 PM IST

Police Officials Working for YSRCP Leaders: కోడ్ అమల్లోకి వచ్చినా పోలీసుల అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​ రావు నామినేషన్ వేయటానికి ఆర్డీవో కార్యాలయానికి రాగా పోలీసులు రాజమార్గం ఏర్పాటు చేశారు. అదే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య వచ్చినప్పుడు మాత్రం గేటు బయట ఆపి నడిచిపొమ్మన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి గులాంగిరి చేసిన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే: వైఎస్సార్సీపీ అభ్యర్థి జగన్మోహన్​​రావు ఎన్నికల నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఆయన కారును నందిగామ గ్రామీణ సీఐ చంద్రశేఖర్​తో పాటు ఇతర పోలీసులు లోపల వరకు అనుమతించారు. ఆయన రెండుసార్లూ ఇదేవిధంగా రెండు సెట్ల నామినేషన్లు వేయటానికి వచ్చారు. అయితే  నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన తంగిరాల సౌమ్యను మాత్రం కార్యాలయం బయట రోడ్డుపై ఆపేశారు.

దీంతో ఆమె కారు బయట వదిలేసి ఆర్వో వద్దకు వచ్చి నామినేషన్ దాఖలు చేసి వెళ్లారు. ఇదే విధంగా కాంగ్రెస్, బీఎస్పీతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు పోలీసులు కారు బయటే ఉంచి పొమ్మని చెప్పారు. కేవలం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్​​రావు కారు మాత్రమే ఆర్డీవో కార్యాలయం లోపల వరకు అనుమతించటం వివాదాస్పదమైంది. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details