తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలుగు భాష ఉన్నంతవరకు రామోజీరావు అస్తమించడు - సంతాప సభలో ఈనాడు మాజీ ఉద్యోగులు - EENADU FORMER EMPLOYEES MEET - EENADU FORMER EMPLOYEES MEET

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 8:10 PM IST

Eenadu's former employees Meet : రామోజీరావు సంస్థల్లో పనిచేయడంవల్ల క్రమశిక్షణతో కూడిన జీవనవిధానాన్ని అలవర్చుకున్నామని, ఈనాడు మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు. అందులో పనిచేస్తున్నాననే గర్వం ప్రతి ఉద్యోగిలో ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతికి సంతాపంగా ఈరోజు ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సభలో 1975 నుంచి 2000 సంవత్సరం వరకు వివిధ బ్యాచ్‌ల ఉద్యోగులు, తమ తమ అనుభవాలు పంచుకున్నారు. 

తెలుగు ఉన్నంతవరకు రామోజీ అస్తమించడని, ప్రతీ ఉద్యోగి జీవితం ఈనాడుకు ముందు, ఈనాడు తర్వాత అనేలా ఉంటుందని వారు వ్యాఖ్యానించారు. ఈనాడులో ప్రస్థానం ప్రారంభించాకా, ఉద్యోగ రీత్యా ఎన్ని కంపెనీలు మారినా ఇక్కడ వచ్చే సంతృప్తి ఉండదని వారు అన్నారు. ఈనాడులో పనిచేసిన సమయంలో ఆయనతో తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. యుగానికి ఒక్కరు ఇలాంటి మహా పురుషులు జన్మిస్తారని కొనియాడారు. ఈనాడులో గతంలో పనిచేసిన జర్నలిస్టులు రామోజీ రావుని స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

ABOUT THE AUTHOR

...view details