ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇంటింటి ప్రచారానికి సువిధ పోర్టల్​లో దరఖాస్తు తప్పనిసరి: ఈసీ - Suvidha Portal For campaign - SUVIDHA PORTAL FOR CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 4:55 PM IST

EC Orders to Political Parties Take Permission on Suvidha Portal For campaign : రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్​లో అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఇంటింటి ప్రచారం, పాంప్లెట్లను ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా సువిధ పోర్టల్​లో దరఖాస్తు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. 

Chief Electoral Officer Mukesh Kumar Meena : సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల (Elections) అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. పెండింగ్​లో ఉన్న ఫాం 7, ఫాం 8 లను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి జాబితాను సవరించాల్సిందిగా ఆదేశించారు. రాజకీయ పార్టీలు నగదు, బహుమతుల పంపిణీ అంశాలపై విస్తృతంగా ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు (Collector) సీఈఓ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details