తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎండ తీవ్రత ఎఫెక్ట్​ - డంపింగ్​ యార్డ్​లో మంటలు - Fire Incident at Medak Dumping Yard - FIRE INCIDENT AT MEDAK DUMPING YARD

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 4:03 PM IST

Dumping Yard Fire in Medak : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. అవసరమైతే తప్ప బయటకి రావొద్దని హైదరాబాద్​ వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి  పరిస్థితిలో ఉష్టోగ్రత పెరగడంతో చిన్న చిన్న వస్తువులు నిప్పులు చెరుగుతున్నాయి. అలానే మెదక్​ జిల్లాలో డంపింగ్​ యార్డ్​లో చెత్త తగలబడిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Dumping Yard Incident in Medak : మెదక్​ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డంపింగ్​ యార్డ్​లో ఉన్న చెత్త ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అగ్గి రాజుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీలు పెట్టి మంటలు అంటుకోలేని చెత్తను వేరు చేస్తున్నారు. దీంతో పాటు వాటర్​ ట్యాంకర్​లతో మంటలను ఆపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details