ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కౌంటింగ్‌ రోజు అల్లర్లకు పాల్పడితే జిల్లా బహిష్కరణ : డీఎస్పీ షరీఫ్‌ - Kadapa DSP on Counting Process - KADAPA DSP ON COUNTING PROCESS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 10:45 AM IST

Kadapa DSP Sharif Strict Arrangements For Counting Process: ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్‌ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే జిల్లా బహిష్కణ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 మందిపై రౌడీ షీట్‌ తెరిచామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. కడప శివారులోని మౌలానా అబుల్‌ కలాం ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

పోలీసుల అనుమతి లేనిదే నాయకులకు నగరంలోని అనుమతి లేదన్నారు. జూన్‌ 4న ఆర్టీసీ బస్సులను నగర శివారు ప్రాంతాల్లోనే ఆపేస్తామన్నారు. శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యం తప్ప మిగిలిన వాటికి అనుమతి లేదన్నారు. దుకాణాలు, పాఠశాలలు, ప్రైవేటు కార్యాలయాలు కూడా మూసివేయాలని పేర్కొన్నారు. 4వ తేదీన 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎవరైనా గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details