తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ డీఎస్సీ అభ్యర్థుల ర్యాలీ - Dsc Candidates Protest - DSC CANDIDATES PROTEST

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 11:23 AM IST

Dsc Candidates Protest In Dilsukhnagar : డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్ధులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఒక వైపు వర్షం కురుస్తున్నప్పటికీ అభ్యర్ధులు నిరసన చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న అభ్యర్ధులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. గత నెల రోజులుగా డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు మండిపడ్డారు. సమయం లేక సిలబస్‌ ఎక్కువయి తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

అయితే ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, డీఏఓ, టెట్‌ పరీక్షలను రాయడం జరిగిందని, వెంటనే డీఎస్సీ పరీక్ష ఉంటే దానికి సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం లేదని వివరించారు. అంతేగాక డీఎస్సీలో కొత్త సిలబస్ మార్పులు చేశారని దాన్ని పూర్తిగా చదవడానికి సమయం పడుతుందని అన్నారు. ఈ కొంత సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details