90ml బాటిల్ తెస్తేనే నీళ్లలోంచి బయటకొస్తా - హుస్సేన్‌సాగర్‌లో దిగి యువకుడి హల్చల్ - Tank Bund Drunkard Viral video
Published : Feb 28, 2024, 11:51 AM IST
Drunk Guy Hulchul At Tank Bund : రోజురోజుకు హైదరాబాద్‌లోని మందు బాబుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఓ యువకుడు ఎంత తాగాడో తెలియదు కానీ హుస్సేన్‌సాగర్‌లో దిగి నానా రచ్చ చేశాడు. గత నెల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెల రోజుల క్రితం మద్యం మత్తులో ఒక యువకుడు హుస్సేన్ సాగర్‌లో దిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు.
Tank Bund Drunkard hulchul Viral Video : గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో దిగిన యువకుడిని బయటకు రప్పించేందుకు నానా తంటాలు పడ్డారు. నీటిలోకి తాడును అందించి యువకుణ్ని బయటికి రావాలని పోలీసులు కోరడంతో అతడు నిరాకరించాడు. 90 ఎంఎల్ మద్యం బాటిల్ తీసుకువచ్చి ఇస్తే బయటకు వస్తానని తేల్చి చెప్పాడు. అతికష్టం మీద ఆ తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న కొంత మంది ఈ దృశ్యాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.