ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డొంకరాయి జలాశయంలో పెరిగిన నీటిమట్టం - 2 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల - Donkarai Reservoir - DONKARAI RESERVOIR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 1:09 PM IST

Updated : Jul 25, 2024, 1:14 PM IST

Donkarai Reservoir Water release in Alluri District : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి నిల్వల కారణంగా అల్లూరి జిల్లా సీలేరు కాంప్లెక్స్​లోని డొంకరాయి జలాశయం వద్ద జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్​ ఆరో గేటు ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాలు నుంచి పెద్ద ఎత్తున నీటి నిల్వలు జలాశయంలోని చేరుతుండటంతో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి సుమారు 8 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు 

డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1035.2 అడుగులకు చేరుకుంది. జలాశయం నీటి మట్టంపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే డొంకరాయి జలాశయం దిగువన ఉన్నవారిని ఖాళీ చేయించారు. చేపలు వేటాడుతున్నవారిని కూడా వెనక్కి రప్పించారు. నీటిమట్టాలు స్థిరంగా కొనసాగే వరకూ నీటి విడుదల కొనసాగుతుందని ఎస్​ఈ చంద్రశేఖర్​ రెడ్డి తెలిపారు. 

Last Updated : Jul 25, 2024, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details