ముంబయి నటి కేసులో లోతైన విచారణ: డీజీపీ ద్వారకా తిరుమలరావు - DGP about Jethwani Issue - DGP ABOUT JETHWANI ISSUE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2024, 4:29 PM IST
DGP Dwaraka Tirumala Rao On Heroine Jethwani Issue : ముంబయి నటి కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వద్ద అభియోగాలను ప్రస్తావించి వారి సమక్షంలో విచారణ జరుపుతామన్నారు. దీనికి మరికొంత సమయం పడుతుందన్నారు. పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏలూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ. పోలీసుశాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పోలీసులు ధైర్యంగా పని చేసేలా సంసిద్ధం చేస్తున్నామని తెలిపారు.
DGP Tirumala Rao Press Meet : ఎస్‌హెచ్‌వోలకు ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు రాలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు. లైంగిక దాడుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలకు వాటి గురించి తెలియజేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.