LIVE: మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్కు హాజరైన పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - PARENT TEACHER MEETING LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2024, 12:41 PM IST
|Updated : Dec 7, 2024, 2:08 PM IST
Deputy CM Pawan Kalyan Attend Parent Teacher Meeting in Kadapa : ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ - టీచర్ మీటింగ్ సర్కారీ బడుల‌్లోనూ జరగబోతోంది. నేడు ఒకేరోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగుతోంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000ల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000లకు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.మరోవైపు తల్లిదండ్రుల సమావేశంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివరించనున్నట్లు ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో 'మాదకద్రవ్యాలు వద్దు బ్రో' పోస్టర్లను ఆవిష్కరిస్తారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో రవికృష్ణ పాల్గొ అక్కడే పోస్టర్లను ఆవిష్కరించనున్నారు.
Last Updated : Dec 7, 2024, 2:08 PM IST