LIVE: ఏలూరు జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ - పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - PAWAN KALYAN IN ELURU DISTRICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2024, 3:24 PM IST
|Updated : Nov 1, 2024, 4:18 PM IST
Pawan Kalyan in Eluru District: ఉప ముఖ్యమంత్రి పవన్ ఏలూరు జిల్లా పర్యటిస్తున్నారు. జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లను పవన్ కల్యాణ్ పంపిణీ చేయనున్నారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపం 2 పధకానికి సంవత్సరానికి 2 వేల 684 కోట్లు ఖర్చు పెట్టనుంది. మొదటి విడతగా 894 కోట్లను పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ప్రతి నాలుగు నెలలకి ఒక ఉచిత సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్ల అందజేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరూ దీపం 2 పథకానికి అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. మొదటి సిలెండర్ మార్చి 31 వరకూ ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అక్టోబర్ 29నుంచీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ 5 లక్షల దాకా బుకింగ్స్ అయ్యాయి. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంపిణీ చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Nov 1, 2024, 4:18 PM IST