LIVE: అనంతపురంలో డాకు మహరాజ్ విజయోత్సవ సభ - ప్రత్యక్షప్రసారం - DAKU MAHARAJ GRAND SUCCESS MEET
Published : Jan 22, 2025, 9:48 PM IST
|Updated : Jan 22, 2025, 10:47 PM IST
Daku Maharaj Grand Success Meet in Anantapur Live: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ విజయోత్సవ సంబరాలు అనంతపురంలో సందడిగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ రికార్డు సాధించిన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొంది, కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉండటంతో బాలకృష్ణ అభిమానులు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఆ సినిమా విజయోత్సవ సంబరాలకు బాలయ్య బాబు, మూవీ టీమ్ హాజరైంది. నగరంలోని 80 అడుగల రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ముప్పై వేల మంది కూర్చొని వీక్షించేలా సంబరాల సభను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి బాలయ్య అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ లో సినిమా థియేటర్ వద్ద జరిగిన సంఘటన నేపథ్యంలో డాకు మహరాజ్ విజయోత్సవ సభకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jan 22, 2025, 10:47 PM IST