నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద సేదతీరుతున్న మొసలి - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - crocodile at nagarjuna sagar dam - CROCODILE AT NAGARJUNA SAGAR DAM
Published : Aug 26, 2024, 1:38 PM IST
Crocodile at Nagarjuna Sagar Dam : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన తటాకాలు, డ్యామ్లు ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొన్నిసార్లు అందులోని మొసళ్లు ఒడ్డుకు చేరి సేద తీరుతున్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద భద్రతా సిబ్బందికి ఇలాంటి దృశ్యమే కనిపించింది.
నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుతం నిండుకుండలా మారింది. దీంతో వరద ప్రవాహానికి మొసళ్లు ఒడ్డుకు చేరుతున్నాయి. ప్రధాన డ్యామ్ వద్ద ఉన్న రాతి కట్టడంపై ఓ మొసలి సేద తీరుతూ కనిపించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, మొసలి సేద తీరుతున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రించారు. దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. గతంలో భారీ వర్షాలకు నాగార్జున సాగర్ పూర్తిగా నిండటంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. ఆ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.