ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బయటపడిన నాణ్యతా లోపం - జాతీయ రహదారిపై ఏర్పడిన పగుళ్లు - Cracks on National Highway

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 12:30 PM IST

Cracks on National Highway in Anantapur : జాతీయ రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జాతీయ రహదారి (NH-67) నిర్మాణంలో నాణ్యతా లోపం బయటపడింది. ఇంకా పూర్తి కాకుండానే పగుళ్లు ఏర్పడటం అందరినీ విస్మయపరుస్తోంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం నుంచి విడపనకల్లు మండలంలోని కర్ణాటక సరిహద్దు వరకు 52 కిలో మీటర్ల మేర 540 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ సిమెంటు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే పెంచులపాడు నుంచి డొనేకల్లు వరకు చాలా చోట్ల ఇలా పగుళ్లు ఏర్పడ్డాయి. 

వాటికి సకాలంలో మరమ్మతులు చేయకపోవటతో రోజురోజుకూ రహదారిపై బీటలు వారటం అధికమవుతోంది. నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగించే రహదారిలో ఇలా పగుళ్లు ఏర్పడటం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. జాతీయ రహదారి అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details