ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మదనపల్లి ఆర్డీవో కార్యాలయాన్ని ఉద్ధేశపూర్వకంగానే తగలబెట్టారు: సీపీఐ నారాయణ - CPI Narayana on RDO Office incident - CPI NARAYANA ON RDO OFFICE INCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 10:21 PM IST

CPI Narayana React on Madanapally RDO Office Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఫైల్స్‌ తగలబెట్టి భూకబ్జా దారుల్ని కాపాడే ప్రయత్నం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆర్డీవో కార్యాలయాన్ని ఉద్ధేశపూర్వకంగానే తగలబెట్టారని నారాయణ పేర్కొన్నారు. అది షార్ట్‌ సర్క్యూట్‌ కాదని, ముఖ్యమైన ఫైల్స్‌ తప్ప ఆఫీసు మాత్రం దగ్ధం కాలేదని ఆయన అన్నారు. సీపీఐ నేత మురళి గత నాలుగైదు నెలలుగా అనేక భూకబ్జాలను వెలికి తీశారని నారాయణ తెలిపారు. ఫైల్స్‌ను తగలబెట్టి భూకబ్జాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని తెలిసి పర్యాటక శాఖ కార్యాలయాన్ని తగలబెట్టారని నారాయణ చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని భూకబ్జాదారులను బయటపెట్టాలని నారాయణ డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఇది యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details