సొంత చెల్లెలు చీర గురించి సీఎం జగన్ మాట్లాడటం దౌర్భాగ్యం: రామకృష్ణ - CPI Ramakrishna Fire on CM Jagan - CPI RAMAKRISHNA FIRE ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 1:40 PM IST
CPI Leader Ramakrishna Fire on CM Jagan : సొంత చెల్లెలు చీర గురించి మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ఉండటం దౌర్భాగ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి వివివేకానంద రెడ్డి హత్య కేసులో ఐదేళ్లుగా జగన్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టును ప్రభావితం చేయడానికి అవినాష్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. హత్య రాజకీయాలు చేసి, చిన్నపిల్లాడు, అమాయకుడని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో జగన్కు తెలియదా అని ప్రశ్నించారు.
CM Jagan About YS Sharmila Saree : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని ప్రజలు గమనించాలని రామకృష్ణ కోరారు. ప్రజలంతా ఇండియా కూటమితో కలిసి ఎన్డీఏ కూటమిని ఓడించాలని కోరారు. పింఛన్ల విషయంలో రాష్ట్రంలో రాజకీయ డ్రామా నడుస్తోందని అన్నారు. మే 1న సచివాలయ సిబ్బంది తరపున పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.