తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం వాడుకుంటున్నాయి : సురవరం సుధాకర్ రెడ్డి - Suravaram On Telangana Rebellion - SURAVARAM ON TELANGANA REBELLION

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 4:29 PM IST

Suravaram Sudhkar Reddy On Telangana Rebellion : రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని సీపీఐ  జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సాయుధ పోరాటంపై హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయుధ చరిత్రపై మూడు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డితో కలిసి సురవరం సుధాకర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం తర్వాత పోరాటం ముగిసిందని ఇందులో ఎంతోమంది అసువులు బాసారని తెలిపారు.

కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, రైతుల పోరాటం ద్వారానే నిజాం తలొగ్గారని కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వం బలగాలతో లొంగినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. రైతాంగ సాయుధ పోరాటం హిందూ, ముస్లిం మధ్య జరిగిందని చరిత్రను వక్రీకరిస్తున్నారని ఈ ఇది ఆధిపత్య వర్గానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని గుర్తు చేశారు.  

నిజాం కింద పని చేసిన వారిలో హిందువులు కూడా ఉన్నారని సాయుధ పోరాటంలో ముస్లింలు కూడా భాగస్వామ్యులైనారని తెలిపారు. ఈ విషయం నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ సాయుధ పోరాటం ప్రారంభమయిదన్నారు.

ABOUT THE AUTHOR

...view details