ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం: గిడుగు రుద్రరాజు - సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగురుద్రరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 3:51 PM IST

Congress Manifesto Released in Anantapur Public Meeting: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు (CWC Member Gidugu Rudraraju) పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో జరగనున్న ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో మేనిఫెస్టోను (Manifesto) విడుదల చేయనున్నట్లు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. 

CWC Member Gidugu Rudraraju: కాంగ్రెస్ పార్టీ పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేదని రుద్రరాజు తెలిపారు. అనంతపురంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో తమ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరవుతారని చెప్పారు. మార్చి ఒకటిన తిరుపతిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలను జయప్రదం చేయాలని రుద్రరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు పోతున్నట్లు రుద్రరాజు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details