One Dead Five Rescued in Mypadu Beach of Nellore District : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఓ మిత్ర బృదం మైపాడ్ బీచ్‌కు తరలి వచ్చారు. వారు ఆనందంగా గడుపుతుండగా ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. అప్పటి నీటిలో ఆడుకున్న వారికి కన్నీరే మిగిలింది.
నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఒకరు మృతి చెందగా ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా మైపాడు బీచ్‌కు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. బీచ్‌లో సరదాగా ఈత కొడుతుండగా ఆరుగురు మునిగిపోయారు. వారిని గుర్తించిన మెరైన్ సిబ్బంది ఆరుగురినీ ఒడ్డుకు చేర్చారు. వారిలో అపస్మారక స్థితిలో ఉన్న ఒకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ రఫీగా పోలీసులు గుర్తించారు.
ప్రాణం తీసిన ఈత సరదా- ఊపిరాడక ఇద్దరు విద్యార్థులు మృతి - Children drowned in the pond
విషాదాన్ని నింపిన విహారయాత్రలు- ఈత కోసం దిగి ఐదుగురు విద్యార్థులు మృతి