Vijayawada District Collector As Singer : ఆయన క్షణం తీరిక లేని కలెక్టర్. ఎప్పుడూ ఆఫీసు, ఫైళ్లు, సంతకాలు. కానీ, ఎట్టకేలకు తనకు వచ్చిన అవకాశంతో గాయకుడి అవతారమెత్తారు. తెలుగు ప్రజలకు సుపరిచితమైన, దాదాపు అందరి నోళ్లలో నానే అద్భుతమైన పాటలతో సభికులను హుషారెత్తించారు. నిత్యం అధికారులతో సమీక్షలు, కార్యాలయాల్లో తనిఖీలు, సమావేశాలు, పర్యటనలు ఇలా క్షణం తీరిక లేని విజయవాడ కలెక్టర్ లక్ష్మీశ గాయకుడిగా మారారు.
దాశరధి కృష్ణమాచారి శత జయంతి వేడుకలు సందర్భంగా వేదికపై అలరించారు. పలు సినిమా పాటలను పాడి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశారు. గంగాధర ఫైన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో దాశరధి మణి గీతా మాలిక కార్యక్రమాన్ని మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు.
రజనీకాంత్ సినిమా దళపతిలోని "సింగారాల పైరుల్లోన.. బంగారాలే పండాలంట" అనే పాట ఆలపించారు. ప్రేక్షకుల స్పందన మేరకు మరో పాత సూపర్ హిట్ పాట "ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాది" అనే పాటతో అలరించారు.
తెలుగు భాషా విద్యార్థులకు రిజర్వేషన్లు - మహాసభ తీర్మానం
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!