LIVE : ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశం - పాల్గొన్న ఖర్గే - Congress at LB Stadium LIVE
Published : Jan 25, 2024, 4:39 PM IST
|Updated : Jan 25, 2024, 5:51 PM IST
Congress Booth Level Agents Meeting at LB Stadium LIVE : రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్ లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. బూతు ఏజెంట్లు, నాయకులు భారీగా తరలిరావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకై పాటించాల్సని విధి విధానాలపై చర్చించారు. ఇండియ కూటమి గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధన్యంగా మారింది.