ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 4 hours ago

LIVE : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా భవిష్యత్‌ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం జరిగిన  కలెక్టర్ల సదస్సులో విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని, వాటిని వెతుక్కోవడమే నాయకత్వం అవుతుందని చెప్పారు. సాధారణంగా ఈ తరహా సదస్సుల్లో విజన్ గురించి ప్రస్తావించి దాన్ని సాధించేందుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. 3 నెలలకు కలిపి ఒకేసారి పింఛన్‌ ఇచ్చేలా విధానం తెచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని, ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీపం-2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని, వచ్చే సంవత్సరం స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 60% పైగా భూసమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదని సూచించారు. 
Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details