LIVE: మంత్రి నారాయణ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - MINISTER NARAYANA PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2024, 8:18 PM IST
|Updated : Dec 10, 2024, 8:30 PM IST
Minister Narayana Media Conference: సీఎం అధ్యక్షతన సీఆర్డీయే 42వ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి నారాయణ, అధికారులు హాజరయ్యారు. మొత్తం 20 అంశాలు అజెండాగా సమావేశం జరిగింది. రూ.9,700 కోట్ల మేర పనులకు సీఆర్డీయే ఆమోదం తెలపింది. గత సమావేశంలో రూ.11,467 కోట్ల మేర పనులు ఆమోదం తెలిపారు. 41వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో 23 అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు, 2 వేల 498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదించారు. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాల వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ -4, అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3 వేల 523 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు.ప్రస్తుతం సీఆర్డీయే అథారిటీ 42వ సమావేశం నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకి వివరిస్తున్నారు. ఈ సమావేశంలో రూ.9,700 కోట్ల మేర పనులకు ఆమోదం తెలిపారు. మంత్రి నారాయణ మీడియా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 10, 2024, 8:30 PM IST