పాఠశాల భూమి వైసీపీ నేత పేరిట మ్యుటేషన్- ముగ్గురిని సస్పెండ్ చేసిన కలెక్టర్ - Collector Suspend Three Officers - COLLECTOR SUSPEND THREE OFFICERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 10:57 PM IST
Collector Suspend Three Revenue Officers For Illegal Activities : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులను వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శివశంకర్ సస్పెండ్ చేశారు. బి.కోడూరు మం. గోవిందాయపల్లెలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్సీపీకి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి పేరిట మ్యుటేషన్ చేసినందుకుగానూ ముగ్గురు రెవెన్యూ అధికారులపై కలెక్టర్ వేటు వేశారు. డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్ కుమార్, వీఆర్‌వో గురవయ్యలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వెంకట సుబ్బయ్య నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మ్యుటేషన్ చేయించిన పాసు పుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.10 లక్షలు రుణం తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఈ విషయాన్ని ఈనాడు- ఈటీవీ వెలుగులోకి తేవడంతో విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముగ్గురు రెవెన్యూ అధికారులను సస్పండ్ చేశారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రాత్రి సమయంలో కాపలాదారు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.