ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో విశాఖ జిల్లాలోనే అతి తక్కువ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు: కలెక్టర్‌ - Collector on Assigned Lands

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 5:06 PM IST

Collector Responded on Free Hold Certificates of Assigned Lands in Visakha : విశాఖ జిల్లాలో అసైన్డ్‌ భూములు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లపై కలెక్టర్ మల్లికార్జున (Visakha District Collector Mallikarjuna) స్పందించారు. అసైన్డ్‌ భూములకు అతి తక్కువ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చిన జిల్లా విశాఖేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లకు అర్హత పొందగా విశాఖ జిల్లాలో 596 జీవో ప్రకారం కేవలం 702 ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. 

అసైన్డ్‌ భూములు పొందిన రైతులు 20 ఏళ్లు గడిచాక ఎవరికైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ (Visakhapatnam Metropolitan Region Development Authority) ల్యాండ్ పూలింగ్ కింద విశాఖలో చాలావరకు అసైన్డ్‌ భూములు తీసుకోగా ఎలాంటి పత్రాలు లేని ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారని అన్నారు. ప్రభుత్వ భూమి రక్షణ పక్రియ చేయడం అధికారుల బాధ్యత అని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details