తెలంగాణ

telangana

LIVE : సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ - Rajiv Gandhi Statue Launch Live

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 4:50 PM IST

Updated : Sep 16, 2024, 5:46 PM IST

Rajiv Gandhi Statue Launch Live (ETV Bharat)
CM Revanth Reddy To Launch Rajiv Gandhi Statue Live : మజీ ప్రధానమంత్రి, దివంగత రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఒక పక్క సచివాలయం, మరో వైపు అమరవీరుల స్థూపం. ట్యాంక్‌ బండ్‌పై ఎంతోమంది త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయన్న సీఎం, ఈ ప్రాంతంలో తాను పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించామని, అదే రాజీవ్‌ గాంధీ విగ్రహం లేకపోవడమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్​ దగ్గరుండి ఇవాళ పరివేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు. అలానే పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరోవైపు సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై రాజకీయ  చర్చ చేయొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీఆర్​ఎస్​కు హితవు పలికారు. విగ్రహంపై మాట్లాడుతున్న వారికి రాజీవ్‌గాంధీ చరిత్ర తెలిసేలా పుస్తకాన్ని  పంపిస్తామని పొన్నం తెలిపారు. విగ్రహాన్ని కూలుస్తామంటే, కాంగ్రెస్ ఏమైనా బలహీన పార్టీ? అని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ విగ్రహం దగ్గరకు ఎవరూ రాలేరని స్పష్టంచేశారు. 
Last Updated : Sep 16, 2024, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details