LIVE : నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth Reddy Live

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 12:20 PM IST

Updated : Sep 18, 2024, 2:39 PM IST

thumbnail
CM Revanth Unveils the New Policy For MSME Live : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పటిష్ఠతే లక్ష్యంగా నూతన ఎంఎస్​ఎంఈ విధానాన్ని ఇవాళ రాష్ట్రప్రభుత్వం ఆవిష్కరించింది. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. పారిశ్రామికరంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘పరిశ్రమ 4.0’ పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ నూతన విధానం దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించారు. 33 ఏళ్లకు భూమితోపాటు భవనాల లీజు, నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామికవాడ సహా పలు అంశాలను కొత్త విధానంలో చోటు కల్పించారు. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది.
Last Updated : Sep 18, 2024, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.