LIVE : 'పింక్ పవర్ రన్ - 2024' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి - Pink Power Run 2024 - PINK POWER RUN 2024
Published : Sep 29, 2024, 9:17 AM IST
|Updated : Sep 29, 2024, 10:12 AM IST
Pink Power Run For Breast Cancer Awareness Live : బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 3కే, 5కే, 10కే పరుగు కార్యక్రమాన్ని పెట్టారు. ఈ అవగాహన పరుగులో పాల్గొననున్న ఐటీ, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో ఈ పరుగు చాలా ఉత్సహంగా సాగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు పెద్ద ఎత్తున నిర్వహించారు. కాగా ఈ అవగాహన పరుగు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ పింక్ పవర్ రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Last Updated : Sep 29, 2024, 10:12 AM IST