LIVE : పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి - CM Revanth Reddy live at lb nagar - CM REVANTH REDDY LIVE AT LB NAGAR
Published : Aug 2, 2024, 4:02 PM IST
|Updated : Aug 2, 2024, 4:59 PM IST
CM Revanth Reddy Meet with Promoted Teachers : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారంతా సీఎం రేవంత్ రెడ్డికి సత్కరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు సాధించారు. దీంతో టీచర్స్ కల నెరవేరినట్లు అయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపి, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. అంతకు పదోన్నతులు, బదిలీలకు అడ్డంగా ఉన్న చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించడంతో వీరిందరికీ మేలు జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌ను సీఎం తన వద్దే అంటిపెట్టుకుని ఉంచున్నారు. దీంతో ఈ వివాదంపై ప్రత్యేకం దృష్టి సారించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో టీచర్ల ప్రమోషన్లకు మార్గం సుగమం అయింది. వివాదాలకు తావులేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ 1, 2 పరిధిలోని గవర్నమెంట్, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరిగింది. పదోన్నతుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ విధానమంతా ఆన్‌లైన్‌లో పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Last Updated : Aug 2, 2024, 4:59 PM IST