తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 5:30 PM IST

Updated : Dec 3, 2024, 6:23 PM IST

CM Revanth Reddy LIVE : హైదరాబాద్​లో పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రారంభిస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. వీటితో పాటు కేబీఆర్​ పార్కు చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు సీఎం కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్​ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 
Last Updated : Dec 3, 2024, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details