LIVE : యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి - కుటుంబసమేతంగా స్వామివారికి పూజలు - CM REVANTH REDDY LIVE
Published : Nov 8, 2024, 11:19 AM IST
|Updated : Nov 8, 2024, 2:16 PM IST
CM Revanth Musi Revitalization Yatra Live : మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ వెంబడి పాదయాత్రతో మరో అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలోనే బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సీఎం సమీక్షంచనున్నారు. మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, అందుకోసం వలిగొండ మం. సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్ర ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే మూసీ పరివాహకం నుంచి రైతులతో కలిసి సీఎం పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహ ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకోనున్న సీఎం, మూసీ ఒడ్డున భీమలింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. చివరగా నాగిరెడ్డిపల్లి వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప రథం పైనుంచి సీఎం ప్రసంగం ఉండనుంది. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లును మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా 2 వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Last Updated : Nov 8, 2024, 2:16 PM IST