ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎంపై రాయి దాడి కేసుతో నాకు సంబంధం లేదు: దుర్గారావు - stone Pelting Case Suspect released - STONE PELTING CASE SUSPECT RELEASED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 6:46 AM IST

CM Jagan Stone Pelting Case Suspect Released: సీఎంపై రాయి దాడి కేసులో అనుమానితుడుగా భావిస్తున్న దుర్గారావును పోలీసులు ఎట్టకేలకు ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లారు. దుర్గారావును విడుదల చేయాలంటూ శనివారం కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. కుటుంబసభ్యుల ఆందోళనతో ఎట్టకేలకు దుర్గారావును విడుదల చేశారు.  నాలుగు రోజుల పాటు పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు విచారణ వివరాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. సీఎంపై రాయి దాడి ఘటనపై పోలీసులు ప్రశ్నించారని అన్నారు. సీఎంపై రాయిదాడి ఎందుకు చేయించావని పోలీసులు తనను నిలదీసినట్లు దుర్గారావు చెప్పారు. దాడి వెనక టీడీపీ నేతల హస్తం ఉందా ? లేదా ? చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు దుర్గారావు తెలిపారు. 

రాయి దాడిలో బోండా ఉమ హస్తం ఉందా అని ప్రశ్నించారని పేర్కొన్నారు. రాయి దాడి కేసు నిందితుడు సతీశ్‌తో నాకు సాన్నిహిత్యం లేదని దుర్గారావు చెప్పారు. సీఎంపై దాడి చేయమని తాను ఎవరికీ చెప్పలేదని, దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు గట్టిగా చెప్పినట్లు వెల్లడించారు. రెండు రోజులు సీసీఎస్, రెండు రోజులు మైలవరం పీఎస్​ల్లో ఉంచి విచారించారని అన్నారు. సీఎంపై దాడితో సంబంధం లేదు కాబట్టే తనను విడుదల చేశారని దుర్గారావు తెలిపారు. మరిన్ని వివరాలు దుర్గారావుతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి జయప్రకాశ్‌ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details