ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏకాదశి, మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు- రాష్ట్ర ప్రజలకు ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్ష - Festival Wishes - FESTIVAL WISHES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 12:14 PM IST

CM Wishes to people occasion of Moharram and Ekadashi festivals : మొహర్రం, తొలి ఏకాదశి పండుగల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ రోజు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్​ వేదికగా తెలిపారు.

మొహర్రం పర్వదినాన ముస్లిం సోదరసోదరీమణులకు శుభం కలిగేలా చూడాలని అల్లాను ప్రార్ధిస్తున్నాని చంద్రబాబు తెలిపారు. అమరవీరుడు ఇమామ్ హుస్సేన్ సమాజం కోసం ప్రాణ త్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గ లేదని చెప్పారు. ఇదే ఆదర్శంగా పరుల క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపడమే మన కర్తవ్యం కావాలని అప్పుడే సమాజం వికసిస్తుందని హితవు పలికారు. ఈ క్రమంలోనే మొహర్రం సందర్భంగా గవర్నర్​ జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతికి, సహనానికి మొహర్రం ప్రతీకని పేర్కొన్నారు. త్యాగం, శాంతి వంటి ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details