ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు - Chandrababu Visit Srisailam Temple - CHANDRABABU VISIT SRISAILAM TEMPLE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 1:14 PM IST

Chandrababu Visit Srisailam Temple : శ్రీశైలం మల్లికార్జున స్వామిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ఆయన ప్రదక్షిణ చేశారు. అనంతరం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ముఖ్యమంత్రికి పండితులు తీర్థప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. 

Chandrababu Srisailam Tour : దేవాలయం వెలుపల చంద్రబాబును కలిసేందుకు నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో కాసేపు ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. వారికి ముఖ్యమంత్రి అభివాదం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. 

అంతకుమందు ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ  బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details