ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: పోలవరం ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Visit Polavaram Project - CHANDRABABU VISIT POLAVARAM PROJECT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 11:55 AM IST

Updated : Jun 17, 2024, 1:55 PM IST

CM Chandrababu Visit Polavaram Project Live: రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది. పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్‌ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే సీఎం చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సేకరించి ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jun 17, 2024, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details