ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Naidu Visit visakha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 11:44 AM IST

Updated : Jul 11, 2024, 1:07 PM IST

CM Chandrababu Naidu Visit North Andhra Districts : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు. దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.చంద్రబాబు ఉత్తరాంధ్ర దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ పలువురు అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను హోం మంత్రి ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. సీఐఐ కాన్ఫరెన్సు అనంతరం మెడ్ టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. 
Last Updated : Jul 11, 2024, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details