LIVE: తిరుమల ఘటనపై సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2025, 5:51 PM IST
|Updated : Jan 9, 2025, 6:27 PM IST
CM Chandrababu Press Meet in Tirumala Live: తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, స్థానిక నేతలు ఉన్నారు. బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. జిల్లా అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్‌ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఘటనపై చంద్రబాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం ప్రెస్‌మీట్ ప్రత్యక్షప్రసారం మీకోసం
Last Updated : Jan 9, 2025, 6:27 PM IST